ETV Bharat / state

వర్షమైనా సరే..మందు దొరికే వరకూ కదలమంతే..! - విశాఖ జిల్లా వైన్ షాపుల రద్దీ

అసలే కరోనా.. ఆపై వర్షం..ఈ సమయంలో ఎవరైనా సరే అడుగు బయటపెట్టాలంటే భయపడతారు. కానీ మందుబాబులు మాత్రం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మద్యం కోసం ఎగబడతున్నారు. విశాఖ పూర్ణమార్కెట్ వద్ద మందుబాబుల తీరు చూసి పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

drunkers stood for liquor at Visakha Poornamarket even in the rain

author img

By

Published : Aug 14, 2020, 3:17 PM IST

విశాఖలో మందుబాబులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మద్యం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. పూర్ణమార్కెట్ వద్ద ఉన్న వేలంపేట మద్యం దుకాణం వద్ద గుంపులు గుంపులుగా చేరి మద్యం కోసం ఎగబడ్డారు. కనీసం అటువైపు వెళ్లే వారికి దారి కూడా ఇవ్వకుండా అడ్డుగా గుమిగూడటంతో చుట్టుపక్కల నివాసాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న సమయంలో మందుబాబులు ఇలా రోడ్లపై విచ్చలవిడిగా చేరటం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వర్షంలో మద్యం కోసం లైన్లో నిలబడ్డ మద్యం ప్రియులు

ఇదీ చూడండి

'ఏపీలోనూ బెంగళూరు హింస తరహా ఘటనలకు అవకాశం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.