ETV Bharat / state

మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త - మద్యం సేవించి గొడవ పడుతూ తుముడిపుట్టులో భార్యను చంపిన భర్త

మద్యం మత్తులో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం.. విషాదంగా ముగిసింది. విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం తుముడిపుట్టులో.. బురుడి కోమటి, పొర్తిమా దంపతులు మద్యం సేవించి గొడవపడుతున్నారు. ఈ క్రమంలో భార్య తలపై భర్త బలంగా కొట్టడంతో ఆమె మరణించిందని మృతురాలి సోదరుడు తెలిపాడు.

husband killed wife at tumudiputtu
తుముడిపుట్టులో భార్యను హతమార్చిన భర్త
author img

By

Published : Jan 8, 2021, 11:05 PM IST

విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం తుముడిపుట్టు గ్రామంలో.. భర్త చేతిలో భార్య హత్యకు గురైంది. బురుడి కోమటి అనే వ్యక్తికి పొర్తిమా అనే మహిళతో 8 నెలల క్రితం వివాహం జరిగింది. మద్యం సేవించి గొడవ పడటం ఇద్దరికీ అలవాటేనని.. ప్రతిరోజూ ఘర్షణకు దిగుతారని గ్రామస్థులు తెలిపారు. ఈ క్రమంలో భార్య తలపై భర్త బలంగా కొట్టడంతో.. మృతి చెందిందని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బురుడి కోమటికి ఒడిశాలోని లక్కుపానికి చెందిన గోల్లోరి రాధతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. మద్యానికి బానిసైన భర్త వ్యవహరం నచ్చక.. రెండేళ్ల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అతడిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో.. వివాహం చేస్తే మారుతాడని బంధువులు భావించారు. మొండిగుమ్మకు చెందిన బురుడి పొర్తిమాతో మళ్లీ పెళ్లి చేయగా.. ప్రతి రోజూ ఇద్దరూ తాగి గొడవకు దిగేవారని స్థానికులు తెలిపారు. పొర్తిమ సోదరుడు నరేష్ నిన్న గ్రామానికి రాగా అందరూ సరదాగా మద్యం సేవించామని తెలిపాడు. గొడవపడుతున్న వారిరువురినీ ఓ సారి బుజ్జగించామని.. మరోసారి ఘర్షణకు దిగిన సమయంలో ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో ఆమె సోదరుడు పేర్కొన్నాడు. నిందితుడికి నలుగురు పిల్లలు ఉన్నారు.

ఇదీ చదవండి: విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ వితరణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.