ETV Bharat / state

విశాఖలో గుట్టుగా డ్రగ్స్ అమ్మకాలు.. ఇద్దరు అరెస్టు - విశాఖలో డ్రగ్స్ అమ్మకాలు

విశాఖలో డ్రగ్స్ సరఫరాదారులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు.. గాజువాక పరిసరాల్లో సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలను గుర్తించారు. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 63 ఎల్.ఎస్.డి. బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు.

విశాఖలో గుట్టుగా డ్రగ్స్ అమ్మకాలు
విశాఖలో గుట్టుగా డ్రగ్స్ అమ్మకాలు
author img

By

Published : Jun 12, 2022, 4:56 PM IST

విశాఖలో గుట్టుగా సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో డ్రగ్స్ వినియోగం, సరఫరా, కొనుగోళ్లుపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులకు.. గాజువాక పరిసరాల్లో సింథటిక్ డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు గిరీష్, తేజ నాయుడు అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లిసర్జిక్ యాసిడ్ డైథలామిడ్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు విశాఖ సీపీ తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ సరఫరా చేసిందుకు పోస్టల్ సర్వీసును వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు.

"డ్రగ్స్‌కు సంబంధించిన 63 ఎల్.ఎస్.డి. బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నాం. బెంగళూరు, గోవా, హైదరాబాద్ నుంచి డ్రగ్స్‌ తెస్తున్నారు. గిరీష్‌ తేజ మొదట డ్రగ్స్‌ సేవించేవాడు. డబ్బు సంపాదన కోసం వ్యాపారం మొదలుపెట్టాడు. రూ.650 కొని రూ.2 వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించాం." - శ్రీకాంత్, విశాఖ పోలీస్ కమిషనర్

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.