ETV Bharat / state

వీఎంఆర్​డీఏ తొలి ఛైర్మన్​గా ద్రోణంరాజు శ్రీనివాస్ - vmarda chairman

మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్​కు జగన్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను విశాఖ మెట్రో రీజియన్ డెవలప్​మెంట్ అథారిటీ ఛైర్మన్​గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ద్రోణంరాజు శ్రీనివాస్
author img

By

Published : Jul 13, 2019, 11:04 PM IST

విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) తొలి ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శ్యామల రావు ఉత్తర్వులు జారీ చేశారు. 2016 లో వీఎంఆర్‌డీఏ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఛైర్మన్‌ నియామకం ఇదే తొలిసారి. ఏడాది పాటు వీఎంఆర్డీఏ ఛైర్మన్ పదవిలో ఆయన కొనసాగనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తెదేపా అభ్యర్థిపై ఓటమి చవిచూశారు. గతంలో వైఎస్‌ఆర్‌ హయాంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రభుత్వ ఛీఫ్ విప్‌గా పని చేశారు. ఇప్పటి వరకు వీఎంఆర్‌డీఏ తాత్కాలిక ఛైర్మన్‌గా మున్సిపల్‌ శాఖ కార్యదర్శి వ్యవహరించారు. ఛైర్మన్ నియామకం జరగినందున ఇతర డైరక్టర్ల నియామకాన్నీ ప్రభుత్వం చేపట్టనుంది.

Intro:Ap_Vsp_105_13_Lok_Adalath_Bhimili_Av_AP10079
బి రాము భీమునిపట్నం నియోజవర్గం విశాఖ జిల్లా

Body:విశాఖ జిల్లా భీమిలి లో లో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా లోక్ అదాలత్ నిర్వహించారు భీమిలి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ మెజిస్ట్రేట్ ఎం ప్రమీలారాణి అదాలత్ సభ్యులు ఎం పార్వతీశం ఈశ్వరరావు లో సమక్షంలో లో పలు కేసులు పరిష్కరించారు భీమిలి ఆనంద పురం లలో లో ఏళ్ల తరబడి పరిసర పరిష్కారాలకు నోచుకోని చిన్న చిన్న తగాదాలు వివిధ రకాల వాహన కేసులు ఇరుపక్షాల అంగీకారంతో కేసును కొట్టివేశారు

Conclusion:ఇరుపక్షాల అంగీకారం మేరకు రాజి ద్వారా కేసులు పరిష్కారానికి నోచుకున్నాయి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.