విశాఖ వాల్తేరు డివిజన్ పరిధిలో 34 చోట్ల రిజర్వేషన్ టిక్కెట్ల బుకింగ్ కౌంటర్లు తెరచినట్లు డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. జూన్ ఒకటి నుంచి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. ఇందులో వాల్తేర్ డివిజన్ నుంచి నాలుగు రైళ్లు వెళ్తాయన్నారు. ఏపీ ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్లు విశాఖ నుంచే బయల్దేరుతాయన్నారు. ప్రయాణికులు కనీసం రెండు గంటల ముందుగా రైల్వే స్టేషన్కి చేరుకుంటే మంచిదన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, ధర్మోస్టాట్ మెషీన్లతో ఉష్టోగ్రత పరిశీలించడం, శానిటైజేషన్ వంటివి ఉంటాయన్నారు.
జూన్ ఒకటి నుంచి ప్రత్యేక రైళ్లు: వాల్తేరు డీఆర్ఎం - జూన్ ఒకటి నుంచి ప్రత్యేక రైళ్లు
జూన్ ఒకటి నుంచి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించిందని వాల్తేరు డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇందులో వాల్తేర్ డివిజన్ నుంచి నాలుగు రైళ్లు వెళ్తాయన్నారు.