విశాఖ జిల్లా చోడవరంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. తాగునీటిని సరఫరా చేసే పైపులకు మూడు చోట్ల రంధ్రాలు పడ్డాయి. ఈ కారణంగా పంచాయతీ కొళాయిల నుంచి బురద నీరు వస్తోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చోడవరం శివారు ద్వారకానగర్‌లో 250 కుటుంబాలున్నాయి. చోడవరంలో పెద్ద నివాసిత కాలనీ ద్వారకానగరే. ఈ ప్రాంతంలో పది కొళాయిల నుంచి బురద నీరు వస్తోంది. నెల రోజులుగా ఇదే పరిస్థితి. ఆడవాళ్లు సమీపంలో ఉన్న చోడవరం నుంచి నీటిని మోసుకుని తెచ్చుకుంటుండగా... మగవారు ద్విచక్రవాహనాలపై తాగునీటిని తెస్తున్నారు. పంచాయతీ పెద్దలు కలుగజేసుకుని తాగునీటి కష్టాలు తీర్చాలని ద్వారకానగర్ వాసులు కోరుతున్నారు. తాగునీటి గొట్టాలకు మరమ్మతులు చేపడుతున్నట్లు పంచాయతీ కార్యదర్శి లోవరాజు చెప్పారు.
ఇదీ చదవండీ... కొత్త ప్రతిపాదనలతో ఒక్క పాఠశాలా మూతపడకూడదు..: సీఎం