Emotional teaching methods: అభ్యాస ప్రక్రియను ప్రభావవంతంగా... సమర్ధవంతంగా చేయడానికి ఉపాధ్యాయులు భావోద్వేగ బోధనా పద్ధతులను అలవర్చుకోవాలని ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన భాషావేత్త, సాఫ్ట్ స్కిల్స్ ఫ్యాకల్టీ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ అన్నారు. భావోద్వేగ భాషా ఉపాధ్యాయునికి ఉండే వివిధ లక్షణాలను ఆయన వివరించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ క్యాంప్ సందర్భంగా బీఇడీ విద్యార్థులకు ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. విద్యార్థులకు సబ్జెక్ట్ పట్ల భావోద్వేగ సంబంధాన్ని పెంపొందించాలని తెలిపారు.
ఉపాధ్యాయులు తమ బోధనా లక్షణాలతో ఇతరులకు ఆదర్శంగా నిలవాలవాలని ఐఏఎస్‌ఈ ప్రిన్సిపాల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలు ప్రొఫెసర్ టి.శోభశ్రీ అన్నారు. విద్యార్థుల్లో ఊహాశక్తిని రగిలించేలా ఉపాధ్యాయుడు ఉండాలని విద్యా విభాగాధిపతి డాక్టర్ టి షారన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టీ షారన్ రాజు, డాక్టర్ ఎం పుష్ప, డాక్టర్ కేవీ ప్రసన్న, డాక్టర్ సోని, డాక్టర్ విద్యావతి, డాక్టర్ తిరుమలాంబ, డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్‌ను ప్రొఫెసర్ శోభాశ్రీ సత్కరించారు.
ఇదీ చదవండి: విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. ఓటీటీలో పాఠాలు: మంత్రి సురేశ్