గంజాయి రవాణా(cannabis trafficking) ఘటనపై విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు(DIG RANGARAO NEWS) స్పందించారు. రెండు వారాలుగా ఇతర రాష్ట్రాల పోలీసులు వస్తున్నారన్న డీఐజీ..గంజాయి కేసు నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పోలీసులు.. స్థానిక పోలీసులను తీసుకువెళ్లాలన్న ఆయన.. నల్గొండ పోలీసులు మా సాయం తీసుకోలేదని వెల్లడించారు. స్థానిక పోలీసుల సాయం తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్న డీఐజీ.. కేరళ, తమిళనాడు, కర్ణాటక పోలీసులూ వస్తున్నారని తెలిపారు. తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు గంజాయి మాఫియా అన్నారని.. అదేంటో చెప్పాలని అన్నారు.
మాట్లాడిన దానిపై పూర్తి వివరాలు ఇవ్వాలని నక్కా ఆనంద్బాబును అడిగినట్లు వెల్లడించిన డీఐజీ రంగారావు.. పూర్తి వివరాలకు ఇవ్వకే సీఆర్పీసీ 160 ప్రకారం నోటీసులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. గంజాయిపై సమాచారం ఉందన్న వారి నుంచి ఆధారాలు సేకరిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: