ఇదీ చూడండి:
మాఘ పౌర్ణమి సందర్భంగా భీమునిపట్నంలో భక్తుల పుణ్య స్నానాలు - భీమునిపట్నం బీచ్లో పుణ్యస్నానాల న్యూస్
మాఘ పౌర్ణమి సందర్భంగా విశాఖ జిల్లా భీమునిపట్నంలోని సముద్రంలో భక్తులు అధిక సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించారు. మాఘ పౌర్ణమి రోజున పుణ్య స్నానాలు ఆచరిస్తే శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. సకల సౌభాగ్యాలు కలగాలని మహిళలు సూర్య నమస్కారాలు చేశారు. కొంతమంది తమ పూర్వీకులకు పిండ ప్రదానాలు చేశారు. పుణ్యస్నానాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు లైఫ్ జాకెట్లతో గస్తీ నిర్వహించారు.
పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు