కార్తిక మాసం ఆరంభాన్ని పురస్కరించుకొని భక్తులు సామూహిక కుంకుమ పూజలు చేశారు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రేబాక లో గూడూపమ్మ అమ్మవారి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడకు వచ్చిన మహిళలతో పండితులు ప్రత్యేక పూజలు చేయించారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... అమ్మవారికి కానుకలు సమర్పించారు. అనంతరం హారతులు అందుకొని... తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇదీ చదవండీ...వైభవంగా గోవర్ధన గిరి పూజలు