పదో తరగతి ఫలితాల్లో విశాఖ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వర్ రెడ్డి సూచించారు. 10వ తరగతి ఫలితాలపై జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశానికి డీఈవో హాజరయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కలిపి ఈ ఏడాది దాదాపు 50వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షల ప్రణాళిక, సన్నద్ధతపై ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించారు. పెండింగ్లో ఉన్న అమ్మఒడి లబ్ధిదారుల జాబితాను పూర్తిచేయాలని సూచించారు.
ఇదీ చదవండి :