పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో... పోలిపాడ్యమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి వరాహ పుష్కరిణి దీపారాధన కార్యక్రమంలో... మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీపాల వెలుగులతో కళ్లు మిరుమిట్లు గొలిపేట్టు అమ్మవారు దర్శనమిచ్చింది. భక్తుల రద్దీ దృష్ట్యా అసౌకర్యం కలగకుండా... అధికారులు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: పద్మనాభస్వామి ఆలయంలో ఘనంగా కోటి దీపోత్సవం