ETV Bharat / state

ఉద్యోగుల శ్రమదానం.. బీచ్​లో చెత్త మాయం

సముద్ర తీరంలో కూర్చుంటే భలే ఆనందంగా ఉంటుంది. మరి ఆ తీరం చెత్తా చెదారంతో ఉంటే ఎలా? అందుకే ఆ పరిశ్రమలోని ఉద్యోగులు నడుం బిగించారు. మూడు కిలోమీటర్ల మేర పేరుకుపోయిన చెత్తనంతా ఏరిపారేశారు. స్వచ్ఛభారత్​ నినాదంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామంటున్నారు.

author img

By

Published : Mar 15, 2020, 4:30 PM IST

Deccan industry employees cleaning venkatanagatam bach in visakhapatnam
Deccan industry employees cleaning venkatanagatam bach in visakhapatnam
ఉద్యోగుల శ్రమదానం.. బీచ్​లో చెత్త మాయం

సముద్ర తీరంలో ప్లాస్టిక్ వ్యర్ధాలను నిరోధించేందుకు డెక్కన్ ఎరువుల పరిశ్రమ ఉద్యోగులు నడుంబిగించారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులు తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. సుమారు 150 మంది ఉద్యోగులు స్వచ్ఛభారత్ నినాదంతో విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం వెంకటనగరం సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. తీరంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్త, జంతు కళేబరాలు వంటివి సేకరించి వేరే చోటకు తరలించి డంపింగ్ చేశారు. ఈ విధంగా సుమారు మూడు కిలోమీటర్ల మేర తీరాన్ని శుభ్రం చేశారు. తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పరిశ్రమ ప్రతినిధి లక్ష్మీపతి అన్నారు. స్వచ్ఛభారత్ నినాదంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: రైలు బ్రేకుల నుంచి పొగలు... ప్రయాణికుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.