విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధిలో నేరెళ్ల వలస కాలనీకి చెందిన 40 ఏళ్ల వియ్యపు రామయ్యమ్మ... కొద్ది కాలంగా గుండె నొప్పి, ఆయాసంతో బాధ పడుతోంది. చికిత్స నిమిత్తం ఆమెను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో తరలించారు. రామయ్యమ్మను ఆసుపత్రి వద్ద దించిన వెంటనే ఆటో వెళ్లిపోయింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని ధ్రువీకరించారు. మృతదేహాన్ని తరలించేందుకు వాహనం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో స్థానిక యువకుల సహకారంతో ద్విచక్రవాహనంపైనే తరలించాల్సి వచ్చింది.
ఇవీ చదవండి: