లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన దర్శనాలను విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సత్యసాయి ప్రేమమందిరంలో తిరిగి ప్రారంభించారు. సాధారణ భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. కరోనా నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల చేశారు.
శానిటైజేషన్ చేస్తూ... భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసి భక్తులను అనుమతి ఇచ్చారు. ఆలయంలో భజన నిర్వహించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు వి ఆర్ నాగేశ్వరరావు, సిటీ సేవా సమితి కన్వీనర్ టిఆర్ఎస్ నాయుడు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర సమన్వయకర్త సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: