విశాఖ అల్లిపురంలో ఓ ఇంట్లో జరిగిన విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. అల్లిపురం వెంకటేశ్వర ఆలయం సమీపంలో దగులుపల్లి సుబ్బారావు, దగులుపల్లి రమణమ్మ తమ ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. ఇవాళ సాయంత్రం విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఇళ్లంతా పొగలు వ్యాపించడంతో ఊపిరి అందకపోవడంతో భార్య భర్తలిద్దరూ మృతి చెందినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, పోలీసు శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ.. దట్టమైన పొగ కారణంగా ఆక్సిజన్ అందకపోవడంతో వారి ప్రాణాలను కాపాడలేకపోయారు.
ఇదీ చదవండి: