విశాఖ జిల్లా అనకాపల్లి మండలం వెంకపాలెం క్వారీని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ. సత్యనారాయణ పరిశీలించారు. క్వారీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్వారీలో లీజుకు తీసుకున్న పరిధి కంటే అధికంగా తవ్వకాలు జరిపారని గనులశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. యజమానికి రూ.33.02 కోట్లు భారీ జరిమానాను విధించారు.
అక్రమాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుండా.. ఇప్పటివరకు ఏం చేస్తున్నారని జేవీ.సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం వల్లే... ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. దీనికి బాధ్యులైన అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి. తూర్పుగోదావరి జిల్లా మన్యంలో నీటిలో చక్కర్లు కొట్టిన కొండచిలువ