విశాఖ స్టీల్‌ప్లాంట్ భూములను దక్షిణ కొరియాకు చెందిన పొహాంగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (పోస్కో) సంస్థకి అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ... సీపీఐ నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహాం ఎదుట నిరసన చేపట్టారు. లాభాలను ఆర్జిస్తున్న విశాఖ ఉక్కుకర్మగారాన్ని మోడీ ప్రభుత్వం... ప్రైవేటు సంస్థల పరం చేయాలని చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. 20 వేల కోట్ల రూపాయల అంచనాతో విస్తరణ పనులకు సిద్ధమవుతోన్న తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం తీవ్ర నష్టం కలిగిస్తుందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ భూముల పరిరక్షణకు మద్దతునిచ్చే అన్నీ రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు. పోస్కో ఒప్పందాన్ని ఉపసంహరించుకొని ప్లాంట్ పరిరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ...మంత్రి కొడాలి నానిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎస్‌ఈసీ