విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ మండలాల్లోని కొవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో కొవిడ్ నివారణకు పంచాయతీ అధికారులు, సిబ్బంది కొద్ది రోజులుగా పరిశుభ్రత చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మురుగు కాలువలు శుభ్రం చేసి, వీధుల్లో చెత్తను తొలగించారు.
నివాస ప్రాంతాల్లో, మురుగు కాలువులు, ప్రభుత్వ కార్యాలయాల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మరోవైపు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కర్ఫ్యూ పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో చాలా మంది కర్ఫ్యూ సమయంలో ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఇవీ చూడండి: