విశాఖ జిల్లా మాడుగులలో కరోనా తీవ్రత పెరిగింది. ఒక్కరోజే నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మాడుగులలో పంచాయతీ ఈఓ, పోలీస్ స్టేషన్ ఎస్ఐ జీబు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు ఎంపీడీవో పొలినాయుడు చెప్పారు.
అనకాపల్లిలో మరో 10 మందికి కరోనా సోకింది. ఇప్పటి వరకు అనకాపల్లి పట్టణంలో 228 మందికి కరోనా సోకింది. కరోనా సోకిన వారిలో విల్లురి జోగినాయుడు వీధికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి, గవరపాలేనికి చెందిన ఇద్దరు మహిళలు, నీలకంట రావు వీధి కి చెందిన యువతి, రైతు సంఘం వీధి కి చెందిన వృద్దుడు, పీలా నాయుడు వీధికి చెందిన యువతి, ఎర్రా వారి వీధికి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి ఉన్నారు. అనకాపల్లిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కంటెన్మెంట్ జోన్ల వద్ద ప్రత్యేక పహారా నిర్వహిస్తున్నారు.
కొవిడ్ -19ను ఎదుర్కొనేందుకు లూపిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో థర్మల్ గన్స్, పల్స్ ఆక్సీ మీటర్లు విశాఖ జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్‌కు అందజేశారు. ఇందులో థర్మల్ గన్స్-02, పల్స్ ఆక్సీ మీటర్లు-20 లను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.
ఇదీ చూడండి