ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన విధివిధానాలపై ఈనెల 7న అమరావతిలో ఎన్నికల సంఘం శిక్షణ శిబిరం నిర్వహించనుంది. దీనికి విశాఖ నుంచి 8 మంది అధికారుల బృందం హాజరవనుంది. వీరిలో జేసీ సృజన, పాడేరు ఐటీడీఏ పీఓ బాలాజీ, సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు ఉన్నారు. వీరు ఈరోజు రాత్రి బయలుదేరి రేపు అమరావతి చేరుకుంటారు. ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వీవీప్యాట్ లెక్కింపు తదితర అంశాలపై ఈసీ వీరికి శిక్షణ ఇస్తుంది.
ఇవీ చదవండి..