ETV Bharat / state

'ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలి' - నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలు వార్తలు

మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పేర్కొన్నారు. నర్సీపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు అధికారులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.

counting staff training at  narsipatnam
నర్సీపట్నం మున్సిపాలిటీ
author img

By

Published : Mar 13, 2021, 10:48 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఆ తరువాత బ్యాలెట్ పత్రాలు లెక్కించాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు , నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య అధికారులకు సూచించారు. ప్రతి బ్యాలెట్ పత్రాన్ని అభ్యర్థుల తరఫున ఉన్న ఏజెంట్లకు చూపించి అనంతరం లెక్కింపు ప్రక్రియ కొనసాగించాలని తెలిపారు. లెక్కింపులో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.

బ్యాలెట్ బాక్సులు తెరిచిన వెంటనే బ్యాలెట్ పత్రాలు 25 చొప్పున కట్టలు కట్టి వేయవలసి ఉంటుందని చెప్పారు. నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 28వ వార్డులకుగాను మూడు చోట్ల లెక్కింపు కేంద్రాలను ప్రారంభించనున్నామని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి టేబుల్​కి ఒక సూపర్​వైజర్​, ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారని తెలిపారు. మొత్తం ఏడుగురు ఎలక్షన్ అధికారులు, 28 మంది సూపర్​వైజర్లు, 84 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారన్నారు.

వీరి అందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చామని గోవిందరావు వివరించారు. ప్రతి ఒక్కరు పారదర్శకంగా లెక్కింపు ప్రక్రియను చేపట్టాలని పిలుపునిచ్చారు. కౌంటింగ్ హాల్​కి వచ్చే ఏజెంట్లు బాల్ పెన్, వైట్ పేపర్స్ తమ వెంట తీసుకురావచ్చని అన్నారు. మిగతా వాటర్ బాటిల్స్, సెల్​ఫోన్లు, స్మార్ట్​వాచ్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించరని సబ్ కలెక్టర్ మౌర్య స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

రీపోలింగ్ నిర్వహించాల్సిన స్థాయిలో ఘటనలేమీ జరగలేదు: ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.