విశాఖ జిల్లా పెదబయలు మండల కేంద్రంలో గ్యాస్ పేలి ఇద్దరికి గాయాలయ్యాయి. టీ పెట్టుకుందామని రాము అనే వ్యక్తి గ్యాస్ వెలిగించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి గ్యాస్ సిలెండర్ పేలింది. ఇంటి రేకులు చీల్చుకుంటూ సిలిండర్ గాలిలో ఎగిరింది. ప్రమాదంలో రాము, అతని భార్య తారాదేవి గాయపడగా... వారిద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ పేలుడు శబ్దానికి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయాన్నే జరగడంతో మావోయిస్టుల బాంబు పేలుళ్లు అనుకుని ప్రజలు ఉలిక్కిపడ్డారు.
ఇదీ చదవండి: