ETV Bharat / state

'ఏపీలో మూడేళ్ళలో 5 ఇళ్లు మాత్రమే నిర్మించారు' - మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి

Pradhan Mantri Gramin Awas Yojana in AP: ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన కింద కేటాయించిన ఇళ్లలో గత మూడేళ్ళ కాలంలో.. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 5 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ లోక్‌సభకు నివేదించింది. అత్యల్పంగా ఏపిలోనే నిర్మించారని వెల్లడించింది. లోకసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి ఈ సమాచారాన్ని సభలో వెల్లడించారు.

ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన
Pradhan Mantri Mantri Gramin Yojana
author img

By

Published : Dec 13, 2022, 10:11 PM IST

Pradhan Mantri Gramin Awas Yojana: ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన కింద కేటాయించిన ఇళ్లలో గత మూడేళ్ళ కాలంలో... ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 5 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ లోక్‌సభకు నివేదించింది. 2019-20 నుంచి 2021-22 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా... 97లక్షల 67 వేల 825 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా... అత్యల్పంగా ఏపిలోనే నిర్మించారని వెల్లడించింది. అంతకుముందు 2016 నుంచి 2022 డిసెంబర్‌ 9వ తేదీ వరకు లక్షా 82 వేల 632 ఇళ్లు ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు కాగా... అందులో 25 శాతం వరకు... 46వేల 726 పూర్తయ్యాయని లోకసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి తెలిపారు.

2016 నుంచి 2019 వరకు 46వేల 721 ఇళ్ల నిర్మాణం జరిగితే.. 2019-22 మధ్య కాలంలో కేవలం ఐదు ఇళ్ల నిర్మాణమే జరిగినట్లు వివరాల్లో పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా... ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది డిసెంబర్‌ 5వ తేదీ నాటికి.. 6928 హెక్టార్లలో పంట దెబ్బతినగా... ఏడుగురు మరణించారని, 291 పశువులు మృతి చెందగా... 13,573 ఇళ్లు దెబ్బతిన్నాయని మరోసభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖితపూర్వకంగా బదులిచ్చారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 1252.80 కోట్లు కేటాయించి.. తొలిదఫాగా 470 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.