ETV Bharat / state

'శ్రద్ధ ఆసుపత్రి దోషి'.. త్రిసభ్య కమిటీ నివేదిక

విశాఖలో కిడ్నీ మార్పిడి ఉదంతంపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ..నివేదికను సిద్ధం చేసింది. ఐదు పేజీలతో కూడిన నివేదికను, 150 రికార్డులను కలెక్టరుకు అందజేసింది. ఈ వ్యవహారం అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని నివేదికలో పేర్కొంది.

'శ్రద్ధ ఆసుపత్రి దోషి'.. త్రిసభ్య కమిటీ నివేదిక
author img

By

Published : May 19, 2019, 1:30 AM IST

విశాఖలో అక్రమంగా కిడ్నీ మార్పిడి జరిగిందన్న వ్యవహారంపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున నేతృత్వంలోని కమిటీ నివేదికను కలెక్టర్ కే. భాస్కర్​కు అందించింది. ఐదు పేజీలతో కూడిన నివేదికను, 150 రికార్డులను అందజేసింది. కిడ్నీ మార్పిడి కేసులో శ్రద్ధ ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా 29 మందికి శస్త్రచికిత్సలు చేసినట్లు నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో శ్రద్ధ ఆసుపత్రులను సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

మరోవైపు ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ విశాఖ పోలీసు కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా నిర్ణయం తీసుకున్నారు. విశాఖ వెస్ట్ ఏసీపీ దేవ ప్రసాద్​ను సిట్ అధికారిగా నియమించారు. అక్రమంగా అవయవ మార్పిడులకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం సమగ్ర విచారణ చేయనుంది.

'శ్రద్ధ ఆసుపత్రి దోషి'.. త్రిసభ్య కమిటీ నివేదిక

ఇవీ చదవండి..

మాయాతో ముగిసిన భేటీ.. మళ్లీ దిల్లీకి సీఎం

Jaipur (Rajasthan), May 18 (ANI): To save the birds from scorching heat, a man from Jaipur has setup more than 800 nests for birds in the city. Suraj Soni, not only provides nests but he also make water and food arrangements for more than 2000 birds. The nests setup by Soni is made of wood which help birds in extreme weather conditions.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.