CM Jagan green signal to increase the retirement age: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లు, పాఠశాల విద్యాశాఖలోని ఎడ్యుకేషన్ సొసైటీ ఉద్యోగుల విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంచే ప్రతిపాదనకు అంగీకారం తెలిపారని.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 8 తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని అజెండాలో చేర్చాల్సిందిగా విద్యాశాఖను ఆయన ఆదేశించారని వెల్లడించారు.
అనంతరం ఏపీ ఆర్ఈఐఎస్ ఉద్యోగుల విరమణ వయస్సును కూడా 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై గతంలో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్..మోడల్ స్కూళ్లు, పాఠశాల విద్యాశాఖలోని ఎడ్యుకేషన్ సొసైటీ ఉద్యోగుల విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంచే ప్రతిపాదనకు ఆంగీకరించినందుకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారన్నారు. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కు ఏళ్లకు పెంచడం సంతోషకరమైన నిర్ణయమని అన్నారు.
గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని..రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫెడరేషన్ నాయకులు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పదించి.. ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై కార్యచరణ ప్రారంభించమని.. సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో మరోసారి ముఖ్యమంత్రిని కోరగా ఉద్యోగుల విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంచే ప్రతిపాదనకు అంగీకారం తెలిపినట్లు.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి