ETV Bharat / state

మాజీమంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతిపట్ల సీఎం సంతాపం - పెన్మత్స సాంబశివరాజు మృతికి సీఎం జగన్ సంతాపం

మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతిపట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడని కొనియాడారు.

cm jagan condolences to ex minister penmasta sambasivaraju demise
మాజీమంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతిపట్ల సీఎం సంతాపం
author img

By

Published : Aug 10, 2020, 12:20 PM IST

మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతిపట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 5 దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో మచ్చలేని నాయకుడిగా ఉన్నారని సీఎం కొనియాడారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడని ప్రశంసించారు.

కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పెన్మత్స సాంబశివరాజు విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సర్పంచ్‌ స్థాయి నుంచి మంత్రి వరకు రాజకీయంగా ఎదిగిన సాంబశివరాజు.. 8 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా పని చేశారు. ఏఐసీసీ కార్యదర్శిగానూ పనిచేసిన సాంబశివరాజు.. శాసనసభలో రెండుసార్లు ప్రొటెమ్‌ స్పీకర్‌గా సేవలందించారు. 1989-94లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1958లో సమితి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజపతినగరం, సతివాడ స్థానాల నుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా ఉన్నారు.

ఇవీ చదవండి..

మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.