విశాఖ జిల్లా వ్యాప్తంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వైకాపా నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. ఎలమంచిలి నియోజకవర్గంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో కేక్ కట్ చేశారు. పేదలకు దుప్పట్లు పంచారు.
రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లోనూ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. పేదలకు నిత్యావసర సరకులు పంచారు. అనకాపల్లి నియోజకవర్గంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి రింగ్ రోడ్డు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే రక్త దానం చేశారు.
ఇదీ చదవండి: