రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు విశాఖ పోర్ట్ మైదానంలో ఉత్కంఠగా కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 800 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. జనవరి 18న ప్రారంభమైన పోటీలు నేటితో ముగిశాయి. గెలిచిన క్రీడాకారులకు మంత్రి అవంతి శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. ప్రతిభ కనబర్చిన వారిని మణిపూర్ వేదికగా ఫిబ్రవరిలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్లు ఎమ్ఏఎఫ్ఐ ఏపీ కార్యదర్శి సైకం రాంప్రసాద్ తెలిపారు. మలేషియాలో జరిగిన ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎనిమిది స్వర్ణాలు సాధించినట్లు వెల్లడించారు. వంద మీటర్ల పరుగు, జావెలింగ్ త్రో సహా ఇతర విభాగాల్లో 35ఏళ్లు పైబడిన క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...