విశాఖ సింహాచలం అడివివరం సహకార పరపతి బ్యాంకులో అవకతవకలు ఆరోపణలపై ఖాతాదారులెవరూ ఆందోళన చెందవద్దని సహకారం సంఘం పాలకవర్గం ఓ ప్రకటనలో కోరింది. 2012కు ముందు అప్పటి పాలకవర్గం రూ. 18 కోట్లు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిందని సంఘం అధ్య క్షుడు కర్రి అప్పలస్వామి పేర్కొ న్నారు. తాను బాధ్యతలు చేపట్టాక మొత్తం సొమ్మును బ్యాంకుల్లోనే డిపాజిట్ చేశామన్నారు.
కొందరూ రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో సంఘంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహకారం సంఘం ప్రతిష్ఠను దెబ్బతీయడం సరికాదని హితవుపలికారు. నిజానిజాలు త్వరలోనే వెల్లడవుతాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి..