విశాఖ దొండపర్తిలోని "ఫార్చ్యూన్ కన్య ఇన్" నక్షత్ర హోటల్లో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ సందడిగా జరిగింది. హోటల్ సిబ్బంది, వినియోగదారుల సమక్షంలో 25 కేజీల డ్రై ఫ్రూట్స్, విదేశీ ఫలాలు.. వైన్ కలిపి కేక్ మిక్సింగ్ చేశారు. ఏటా క్రిస్మస్ ముందు ఈ కార్యక్రమం నిర్వహించి వినియోగదారులకు శుభాకంక్షాలు తెలియజేయడం ఆనవాయితీగా వస్తోందని సిబ్బంది తెలిపారు. క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపి వినియోగదారులకు బహుమతులు ఇచ్చి వారితో ఆనందాన్ని పంచుకుంటామని చెప్పారు.
ఇదీ చూడండి: