విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాదయాత్ర చేపట్టారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చోడవరంలోని తిమ్మన్నపాలెం, జన్నవరం, కొత్తూరు, బెన్నవోలు, గౌరీపట్నం గ్రామాల్లో పర్యటించారు. బెన్నవోలులో పెద్దేరు నదిపై కాలిబాటలు నిర్మించాలని ప్రజలు అడిగారు. చేయూత, విద్యాదీవెన అందలేదని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అర్హులైన వారందరికి పథకాలు అందేలా చూస్తామన్నారు.
ఇవీ చదవండి