విశాఖ జిల్లాలో ఇళ్ల స్థలాల లేఅవుట్‌ల వ్యవహారం ఇంకా రాజుకుంటూనే ఉంది. చోడవరంలో పంప్ హౌస్ స్థలం పట్టాలుగా ఇవ్వడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు 8 ఎకరాల్లో పంప్‌హౌస్ నిర్మించగా.... ఈ స్థలంలోని ఆరు ఎకరాలను పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే రాజు ఆధ్వర్యంలో ప్రజలు తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఇవీ చదవండి: పార్టీలకు రూ.2,512 కోట్లు విరాళాలు.. ఇచ్చిందెవరో తెలీదు!