విశాఖ జిల్లా చోడవరంలో చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. మాంసం లేనిదే ముద్ద దిగని వారు కూడా నేడు బాయిలర్ మాంసం కొనేందుకు భయపడుతున్నారు. చికెన్ అమ్మకాలు తగ్గడంతో వ్యాపారులు దుకాణాలు తెరవటం లేదు. పట్టణంలో 15 వరకు బాయిలర్ చికెన్ దుకాణాలు ఉన్నాయి. రోజుకు 1500 కిలోల నుంచి 2000 కిలోల వరకు మాంసం అమ్మేవారు. నేడు 200 కిలోలు అమ్మాలంటేనే కష్టమవుతుందని వ్యాపారులు వాపోతున్నారు.
అమ్మకాలు లేక వెలవెలబోతున్న చికెన్ దుకాణాలు - vishaka chickn
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భయంతో బాయిలర్ కోడి మాంసం తినేందుకు జనం భయపడుతున్నారు. బాయిలర్ మాంసంతో కరోనా రాదని అవగాహన కలిగిస్తున్నా తినేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు.
అమ్మకాలు లేక వెలవెలబోతున్నా చికెన్ దుకాణాలు
విశాఖ జిల్లా చోడవరంలో చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. మాంసం లేనిదే ముద్ద దిగని వారు కూడా నేడు బాయిలర్ మాంసం కొనేందుకు భయపడుతున్నారు. చికెన్ అమ్మకాలు తగ్గడంతో వ్యాపారులు దుకాణాలు తెరవటం లేదు. పట్టణంలో 15 వరకు బాయిలర్ చికెన్ దుకాణాలు ఉన్నాయి. రోజుకు 1500 కిలోల నుంచి 2000 కిలోల వరకు మాంసం అమ్మేవారు. నేడు 200 కిలోలు అమ్మాలంటేనే కష్టమవుతుందని వ్యాపారులు వాపోతున్నారు.
ఇదీచూడండి:కరోనా ఎఫెక్ట్ : విశాఖ పోర్టులో ముందస్తు జాగ్రత్తలు