విశాఖ జిల్లా అనకాపల్లి డ్రగ్ ఇన్స్పెక్టర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ కలసి అనకాపల్లిలో మందుల దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. శానిటైజర్ అమ్మకాలను పరిశీలించారు. యాచకులు, పేదవాళ్లు శానిటైజర్ తాగితే మద్యం మత్తు వస్తుందన్న అపోహతో తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. శానిటైజర్లను పరిశుభ్రతకి వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పట్టణ సీఐ భాస్కర్ రావు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ ఉపేంద్ర పాల్గొన్నారు
ఇదీ చదవండి 'విశాఖలో మానవ, సాంకేతిక వనరులపై కమిటీ అధ్యయనం చేస్తుంది'