పంచాయతీ ఎన్నికల మూడో దశలో భాగంగా విశాఖ మన్యం పరిధిలోని పాడేరు డివిజన్లో పోలింగ్ జరగనుంది. 178 పంచాయతీలకు 316 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అన్ని భద్రతా చర్యలు చేపట్టినట్లు పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ తెలిపారు. 136 సమస్యాత్మక కేంద్రాల్లో భారీ బందోబస్తు మోహరించినట్టు వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయిన నాలుగు పంచాయతీల పోలింగ్ కేంద్రాలను సమీప సురక్షిత గ్రామాల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
బూసిఫుట్ పోలింగ్ కేంద్రాన్ని కుమడలో, జామిగుడకు కొరవంగిలో, బుంగాపుట్టుకు లక్ష్మీపురంలో, రంగబయలుకు వనుగుమ్మలోని కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఓటింగ్ జరుగుతుందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: