సుప్రసిద్ద ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తల్లిదండ్రుల పేరిట ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు... సాయంమందించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు... విశాఖ చాగంటి సత్సంగం వెల్లడించింది. ఈనెల 21 నుంచి 25 వరకు విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో చాగంటి ప్రవచనాలు ఇవ్వనున్నట్లు సత్సంగం ప్రతినిధి పీ.ఏ.చార్యులు వివరించారు.
ఏటా విద్యా పురస్కారాలను అర్హులైన వారికి ఇస్తున్నామని... వారిలో ఉన్నత విద్య అభ్యసించిన వారున్నారని చార్యులు చెప్పారు. విశిష్ట పురస్కారాన్ని 'ఈ పద్యం జనకులం' వ్యవస్థాపకులు డాక్టర్ ఐవీఎల్ శాస్త్రికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చాగంటి కోటేశ్వరరావు చేతులమీదుగా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: విశాఖలో చాగంటి ప్రవచనాలు... తరలివచ్చిన మహిళలు