ETV Bharat / state

ఆస్తుల పరిరక్షణ పేరుతో తెరపైకి సంబంధం లేని వ్యక్తులు..క్రైస్తవ సంఘాల ఆగ్రహం - vishakapatnam latest news

విశాఖలో సీబీసీఎన్​సీ ఆస్తుల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆస్తుల పరిరక్షణ ముసుగులో సంబంధం లేని వ్యక్తులు, బాప్టిస్టు సంఘాలకు నాయకులమని తెరపైకి రావడాన్ని సీబీసీఎన్​సీ క్రైస్తవ సంఘాలు ఖండించాయి.

విశాఖలో సీబీసీఎన్​సీ ఆస్తుల వివాదం
విశాఖలో సీబీసీఎన్​సీ ఆస్తుల వివాదం
author img

By

Published : Sep 16, 2021, 7:40 PM IST

విశాఖలో కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ ద నార్తర్న్ సర్కార్స్ (సీబీసీఎన్​సీ) ఆస్తుల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆస్తుల పరిరక్షణ ముసుగులో సంబంధం లేని వ్యక్తులు, బాప్టిస్టు సంఘాలకు నాయకులమని తెరపైకి రావడాన్ని సీబీసీఎన్​సీ క్రైస్తవ సంఘాలు ఖండించాయి. జాన్, డానియల్ గాంధీ, జొసెఫ్ ప్రకాష్ అనే ముగ్గురు వ్యక్తులు పదే పదే డబ్బులు డిమాండ్ చేస్తూ హిల్ క్రైస్ట్ బంగ్లా నిర్వాహకులను బెదిరించడంపై వీరు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు వ్యక్తులు చేస్తున్న అరాచకాల చిట్టాతో ఒక కరపత్రాన్ని విడుదల చేసిన సంఘాల సభ్యులు.. ఇకపై వీరి ఆటలను సాగనీయమని హెచ్చరించారు.

వీరికి మద్దతుగా యాకోబు, రత్నకుమార్ అనే వ్యక్తులు కూడా పలు అక్రమాలకు పాల్పడ్డారని క్రైస్తవ సంఘాలు తెలిపాయి. సీబీసీఎన్​సీ పేరిట నిరుద్యోగ టీచర్ల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారన్నారు. వీరికి తగిన బుద్ది చెప్పే విధంగా క్రైస్తవ సమాజం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

AP Cabinet: కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం..అవి ఏంటంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.