విశాఖ జిల్లా అనకాపల్లిలో కేబుల్ ఆపరేటర్ల సంఘం సభ్యులు స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఏపీ ఫైబర్ గ్రిడ్‌కి తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆర్డీవోకి వినతిపత్రం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ ఫైబర్ గ్రిడ్‌కి ప్రస్తుతం నిధులు విడుదల చేయక పోవటంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో త్రిబుల్ ప్లే సర్వీస్ కేబుల్, ఇంటర్నెట్ కనెక్షన్, ఫోన్ సౌకర్యాన్ని తక్కువ ధరకే అందించేలా ఏపీ ఫైబర్‌ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు లక్షలు పెట్టుబడులు పెట్టారన్నారు. ప్రస్తుతం నిధులు మంజూరు చేయకపోవడం వల్ల సెటప్ బాక్స్‌లు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని నిధులు మంజూరు చేయాలని కోరారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపి వినతిపత్రం ఇచ్చారు.
'ఏపీ ఫైబర్ గ్రిడ్‌కి వెంటనే నిధులు విడుదల చెయండి' - cable operaters dharna news in anakapalli
ఏపీ ఫైబర్ గ్రిడ్‌కి తక్షణమే నిధులు విడుదల చేయాలంటూ అనకాపల్లిలో కేబుల్ ఆపరేటర్ల సంఘ సభ్యులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆపరేటర్లు లక్షలు పెట్టుబడి పెట్టారని తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకుని నిధులు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో కేబుల్ ఆపరేటర్ల సంఘం సభ్యులు స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఏపీ ఫైబర్ గ్రిడ్‌కి తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆర్డీవోకి వినతిపత్రం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ ఫైబర్ గ్రిడ్‌కి ప్రస్తుతం నిధులు విడుదల చేయక పోవటంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో త్రిబుల్ ప్లే సర్వీస్ కేబుల్, ఇంటర్నెట్ కనెక్షన్, ఫోన్ సౌకర్యాన్ని తక్కువ ధరకే అందించేలా ఏపీ ఫైబర్‌ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు లక్షలు పెట్టుబడులు పెట్టారన్నారు. ప్రస్తుతం నిధులు మంజూరు చేయకపోవడం వల్ల సెటప్ బాక్స్‌లు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని నిధులు మంజూరు చేయాలని కోరారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపి వినతిపత్రం ఇచ్చారు.
ఇదీ చూడండి: 'ట్రిపుల్ ప్లే సర్వీసులకు మంచి ఆదరణ'