ఎన్నికలు ముగిశాయి... ఫలితాలు వచ్చేశాయి... కొత్త ప్రభుత్వమూ కొలువుదీరింది. కానీ ఆ ఎన్నికల బకాయి మాత్రం ఇంకా అలానే మిగిలి ఉంది. విశాఖ జిల్లాలో ఎన్నికల కోసం పనిచేసిన క్యాబ్ డ్రైవర్లకు నేటికీ బకాయిలు చెల్లించలేదు. రోజుకు డీజిల్‌తో కలిపి రూ. 3000 నుంచి 3500 ఇస్తామని చెప్పిన అధికారులు ఆ తర్వాత మాట మార్చారని క్యాబ్ డ్రైవర్లు వాపోతున్నారు.
ఫైనాన్సర్ల వేధింపులు...
క్యాబ్ డ్రైవర్లందరూ వాహనాలను అద్దె ప్రాతిపదికన తెచ్చుకుని జీవనం సాగిస్తున్నారు. మరికొందరు ఫైనాన్స్‌లో కొనుగోలు చేశారు. ప్రస్తుతం వారందరూ పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా... అధికారులు చెల్లింపులు చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. డబ్బుల కోసం ఫైనాన్సర్లు వేధిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇకనైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఎన్నికల విధులకు బిల్లులు పెట్టుకుని ఇప్పటికే డబ్బులు డ్రా చేసేసుకున్న అధికారులు.. ఏరోజుకు ఆరోజు కష్టించి పొట్ట నింపుకునే క్యాబ్ డ్రైవర్లపై వివక్ష చూపడం దారుణమన్నారు.
ఇది చూడండి: రయ్రయ్: 'సిల్క్ వే'లో రైడర్ల దూకుడు