ETV Bharat / state

Vizag Steel Plant In Budget: విశాఖ ఉక్కుకు రూ.910 కోట్లు

Central Budget: విశాఖ స్టీల్ ప్లాంట్​కు కేంద్రం బడ్జెట్​లో రూ.910 కోట్లు కేటాయించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విద్యాసంస్థల్లో కేంద్ర, గిరిజన, వైజాగ్‌ పెట్రోలియం విశ్వవిద్యాలయాలు మినహా మిగిలిన సంస్థలకు ప్రత్యేకంగా కేటాయింపులు లేవు.

budget allotments to vizag steel plant
budget allotments to vizag steel plant
author img

By

Published : Feb 2, 2022, 7:14 AM IST

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, సింగరేణి బొగ్గు గనులకు మినహా కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా కేటాయింపులేమీ కనిపించలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విద్యాసంస్థల్లో కేంద్ర, గిరిజన, వైజాగ్‌ పెట్రోలియం విశ్వవిద్యాలయాలు మినహా మిగిలిన సంస్థలకు ప్రత్యేకంగా కేటాయింపులు లేవు. ఐఐటీలు, ఐఐఎంలు, ఐసర్‌లు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఎయిమ్స్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్లకు దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలన్నింటికీ కలిపి ఉమ్మడిగా నిధులు ప్రకటించినందున ఏపీ, తెలంగాణల్లోని సంస్థలకు ప్రత్యేకంగా ఎన్ని నిధులు వస్తాయన్నది స్పష్టత లేదు. ఉన్నత విద్యాసంస్థల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఫైనాన్సింగ్‌ ఏజెన్సీ నుంచి రుణాలు తీసుకొని చెల్లిస్తున్నందున వీటికి సంస్థల వారీగా నిధులను చూపలేదు. ఫలితంగా ఎంతమేరకు నిధులు పెరిగాయన్నది స్పష్టత లోపించింది.

* వైజాగ్‌ స్టీల్‌కు రూ.910 కోట్లు ప్రకటించారు. 2021-22లో ఈ సంస్థకు రూ.595 కోట్లు కేటాయించి, అంచనాల సవరణ నాటికి రూ.730 కోట్లకు పెంచారు.

* ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీకి ఈసారి రూ.56.66 కోట్లు కేటాయించారు. 2021-22లో రూ.60.35 కోట్లు ప్రకటించినా అంచనాల సవరణ నాటికి అది రూ.20.11 కోట్లకు తగ్గిపోయింది.

* ఇరు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.44 కోట్లు ఇచ్చారు. వీటికి గత బడ్జెట్‌లో రూ.53.80 కోట్లు కేటాయించినా అంచనాల సవరణ తర్వాత రూ.13.37 కోట్లకు పడిపోయింది.

* విశాఖ పోర్టు ట్రస్టుకు రూ.207.99 కోట్లు కేటాయించారు. 2021-22లో రూ.290 కోట్లుగా పేర్కొన్నా అంచనాల సవరణ సమయానికి అది రూ.104.70 కోట్లకు తగ్గిపోయింది.

* విశాఖ పెట్రోలియం వర్సిటీకి రూ.150 కోట్లు కేటాయించారు. గతేడాది మంజూరుచేసిన రూ.95 కోట్లను పూర్తిగా ఖర్చుచేశారు.

* సింగరేణి కాలరీస్‌కు ఈసారి రూ.2వేల కోట్లు కేటాయించారు.

ఇదీ చదవండి: Employees chalo vijayawada: రంగంలోకి పోలీసులు.. ఉద్యోగ సంఘాల నేతల గృహ నిర్బంధం.!

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.