విశాఖ ఉక్కు కార్మాగారం భాజపా ఆస్తి కాదని సీపీఎం జాతీయ నాయకురాలు బృందా కారఠ్ అన్నారు. విశాఖలో ఉక్కు పరిరక్షణ పోరాట సమితి శిబిరాన్ని సందర్శించిన ఆమె.. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేంగా దీక్ష చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు.
విశాఖ ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులకు అండగా నేనున్నాను. మీ తరపున సీపీఎం పోరాడుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది మీ(భాజపా) సొంత ఆస్తి కాదు. ఈ ప్లాంట్ కోసం ఎంతో మంది కార్మికులు, ఉద్యోగులు తమ జీవితాలను త్యాగం చేసి భారతదేశంలో ఒక ఉన్నతమైన సంస్థగా తీర్చిదిద్దారు. బృందాకారఠ్, సీపీఎం జాతీయ నాయకురాలు
ఇదీ చదవండి: