ETV Bharat / state

ఇప్పుడే వచ్చేస్తానమ్మా అంటూ వెళ్లి.. తిరిగిరాని లోకాలకు.. - boy died in visakha district

Boy died in Accident: కుమారుడంటే ఆ తల్లికి ప్రాణం... తన మీదే ఎన్నో ఆశలు పెట్టుకుంది... ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకునేది. కానీ ఆ బాలుడికి స్నేహితులతో ఆడుకోవటం అంటే మహా ఇష్టం. రోజూ అమ్మకు ఏదోఒకటి చెప్తూ.. ఆటకు వెళ్లేవాడు. ఆ రోజు ఎప్పటి లాగే ఆటకు వెళ్లేటప్పుడు అమ్మ వద్దంది. కానీ ఇప్పుడే వచ్చేస్తానమ్మా అంటూ వెళ్లి.. అనంతలోకాలకు ప్రయాణమయ్యాడు ఆ బాలుడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది.

boy
boy
author img

By

Published : Jun 29, 2022, 8:01 AM IST

‘బయట ఎండ ఎక్కువగా ఉంది.. ఎక్కడికీ వెళ్లొద్దు’ అని తల్లి చెప్పినా.. ‘ఇప్పుడే వచ్చేస్తానమ్మా’ అంటూ ఆటకు వెళ్లిన బాలుడు అనూహ్యంగా దుర్మరణం పాలైన ఘటన మంగళవారం విశాఖపట్నం గాజువాకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జీవీఎంసీ 71వ వార్డు సుందరయ్యకాలనీకి చెందిన పెయింటర్‌ బసవ ప్రకాశ్‌, కనకమహాలక్ష్మి దంపతులకు కుమారుడు శివకిరణ్‌(12), కుమార్తె ఉన్నారు. ఏడో తరగతి చదువుతున్న కిరణ్‌ మధ్యాహ్నం ఆడుకోవడానికి ఇద్దరు మిత్రులతో కలిసి సమీప దుర్గానగర్‌ గ్రీన్‌బెల్ట్‌ స్థలంలోకి వెళ్లాడు. అక్కడే నిలిపి ఉన్న ట్రాక్టర్‌ ఇంజిన్‌ పైకెక్కి స్టీరింగ్‌ వద్ద ఆడుకుంటూ.. పొరపాటున క్లచ్‌ నొక్కాడు. వాహనం ముందుకు కదలడంతో భయాందోళనతో పక్కకు దూకేశాడు. ఊహించని విధంగా అక్కడే ఉన్న రోడ్డు రోలర్‌, ట్రాక్టర్‌ పెద్ద టైరు మధ్యలో ఇరుక్కుపోయాడు. స్నేహితుల కేకలు విని పరుగున వచ్చిన స్థానికులు.. అతికష్టం మీద కిరణ్‌ను బయటకు తీశారు. బాలుడు అప్పటికే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గాజువాక సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.