విశాఖ మెట్రో నగరాభివృద్ధి మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరగాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. విశాఖలోని వీఎంఆర్డీఏలో వివిధ ప్రాజెక్టులపై అధికారులు, సంస్ధ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణలతో మంత్రి సమీక్షించారు. ప్రస్తుతం అమలవుతున్న ప్రాజెక్టుల విధానాలపై ప్రధానంగా చర్చించామని మంత్రి చెప్పారు. విశాఖ లాంటి ఎంతో ఆకర్షణీయమైన సాగర తీరాన్ని పరిరక్షించుకునే చర్యలతో పాటు.. పర్యటకులకు, నగర వాసులకు మరింత అనువుగా తీర్చి దిద్దడంలోనూ వీఎంఆర్డీఏ ప్రత్యేక శ్రద్ద పెడుతుందని తెలిపారు.
ఇదీ చూడండి: