ETV Bharat / state

పర్యటక కంట్రోల్​ రూమ్​ను ప్రారంభించిన సీఎం జగన్ - పర్యటక కంట్రోల్​ రూమ్​ను ప్రారంభించిన సీఎం జగన్

రాష్ట్ర వ్యాప్తంగా పర్యటక ప్రాంతాలలో పర్యటక రక్షణ, అవగాహన కోసం ఈ-చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విశాఖ రుషికొండలో పర్యటక జల విహార నియంత్రణ కేంద్రాన్ని సీఎం జగన్మోహన రెడ్డి దృశ్య శ్రవణ మాధ్యమంలో సీఎం కార్యాలయం నుంచి ప్రారంభించారు.

పర్యటక కంట్రోల్​ రూమ్​ను ప్రారంభించిన సీఎం జగన్

author img

By

Published : Jun 19, 2020, 10:22 PM IST

విశాఖ రుషికొండలో పర్యటక జల విహార నియంత్రణ కేంద్రాన్ని సీఎం జగన్మోహన్​ రెడ్డి దృశ్య శ్రవణ మాధ్యమంలో సీఎం కార్యాలయం నుంచి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సంస్కరణలో భాగంగా పర్యటక ప్రాంతాలలో పర్యటక రక్షణ, అవగాహన కోసం ఈ-చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయగా.. రుషికొండ బీచ్​లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

సీఎం కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ ఈ కంట్రోల్ రూమ్​ను ప్రారంభించగా... రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏటా రుషికొండలో ముప్ఫై వేల మందికి పైగా బోటింగ్ చేస్తారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రెవిన్యూ, పోలీస్, బోట్ ఆపరేటర్లు సమన్వయంతో ఈ కేంద్రం నిర్వహణలో పని చేస్తారు. కచ్చులూరు తరహా ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలో భాగంగా పర్యాటక శాఖలో అనేక రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్​ తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.