ETV Bharat / state

వైకాపాది స్వపరిపాలన.. సుపారిపాలన కాదు: పురందేశ్వరి - భాజపా పురందేశ్వరి తాజా వార్తలు

వైకాపా రెండున్నరేళ్ల పాలనలో ఆరు లక్షల కోట్ల అప్పు చేసిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డపై రూ.1.20 లక్షల అప్పు ఉందని అన్నారు. వైకాపా ప్రభుత్వంలో పాలకులు స్వలాభం కోసం పాలన సాగిస్తున్నారే తప్ప.. సుపరిపాలన కాదని ఆమె ఎద్దేవా చేశారు.

వైకాపా పాలకులది స్వపరిపాలన.. సుపారిపాలన కాదు

author img

By

Published : Mar 13, 2022, 3:54 PM IST

లక్షల కోట్ల అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. వైకాపా ప్రభుత్వంలో పాలకులు స్వలాభం కోసం పాలన సాగిస్తున్నారే తప్ప.. సుపరిపాలన కాదని ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లా బుషికొండ ఏవన్ గ్రాండ్​లో జరిగిన జిల్లా భాజపా శక్తి కేంద్ర ప్రముఖ్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

వైకాపా రెండున్నరేళ్ల పాలనలో ఆరు లక్షల కోట్ల అప్పు చేసిందని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డపై రూ.1.20 లక్షల అప్పు ఉందని అన్నారు. వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసి.., ఎక్కడ అప్పు దొరుకుతుందా అనే వెతుకులాటలో ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేయటం లేదని భాజపాపై దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆక్షేపించారు. కేంద్రం ఇస్తే గానీ రాష్ట్రంలో పూటగడవని పరిస్థితి ఉందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో రహదారులతో పాటు అనేక సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు మంజూరు చేసిందని అన్నారు. వైకాపా ప్రభుత్వం మాత్రం తమ స్వలాభం కోసం పాలన కొనసాగిస్తూ.. రాష్ట్రంలోని భూములను తాకట్టుపెడుతోందని దుయ్యబట్టారు. కనుక ఈ రాష్ట్రానికి ఒక కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో భాజపా సత్తా ఎంటో మరోసారి రుజువైందని పురందేశ్వరి అన్నారు. భాజపాపై దేశ ప్రజలు మరోసారి విశ్వాసాన్ని చూపారన్నారు. ఈ గెలుపు కోసం కృషి చేసిన భాజపా దేశ నాయకత్వానికి ఆమె అభినందనలు తెలిపారు. ఈ విజయంతో పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందన్నారు. అవే ఫలితాలు ఏపీలోనూ పునరావృతం కానున్నాయని.., ఆ దిశగా కార్యకర్తలు దృష్టి సారించాలని ఆమె పిలుపునిచ్చారు.

'సబ్ కా సాత్ - సబ్ కా వికాస్' నినాదంతో భాజపా ముందుకు వెళ్తోందని పురందేశ్వరి అన్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న వేలాది మంది భారతీయ విద్యార్థులను ఆపరేషన్ గంగ పేరుతో స్వదేశానికి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. చివరికి పాకిస్థాన్ విద్యార్థులు కూడా భారత్ జెండా చేతబూని వారి స్వస్థలాలకు చేరుకున్నారంటే..అది మన దేశం గొప్పతనం, ప్రధాని మోదీ పరిపాలనదక్షతకు నిదర్శనమని అన్నారు.

ఇదీ చదవండి

Chandrababu Tour: రేపు జంగారెడ్డిగూడెంకు చంద్రబాబు.. నాటుసారా మృతుల కుటుంబాలకు పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.