ETV Bharat / state

'దాడులపై మంత్రులు చులకనగా ప్రకటనలు చేస్తున్నారు'

రామతీర్థం ఘటనను నిరసిస్తూ భాజపా మహిళా మోర్చా విశాఖ నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. ఓ వైపు అయోధ్యలో రామ ఆలయం నిర్మాణం జరుగుతుండగా...రాష్ట్రంలో ఇటువంటి దాడులు జరగడం దురదృష్టకరమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

bjp protest at visakha
విశాఖలో భాజపా నేతల ధర్నా
author img

By

Published : Jan 3, 2021, 4:30 PM IST

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని భాజపా నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. విజయనగరం జిల్లా రామతీర్థం దేవాలయంలోని విగ్రహ విధ్వంసానికి నిరసనగా విశాఖ నగర పాలక సంస్థ ముందున్న గాంధీ విగ్రహం వద్ద మహిళా మోర్చా ధర్నా చేపట్టింది. ఇప్పటివరకు 20 దేవాలయాల్లో దాడులు జరిగినా... ప్రభుత్వం ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు.

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు మారాలని హిందువులందరూ భగవంతుని ప్రార్థించాలి అని ఆయన కోరారు. ఓవైపు అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతుండగా.. ఇక్కడ దాడులు జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటుంటే మంత్రులు చులకనగా ప్రకటనలు చేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి మార్పు జరగాలని అప్పుడైనా రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి.

రామతీర్థం ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేయాలి: స్వరూపానందేంద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.