హిందూ ధర్మాన్ని పరిరక్షించమనే వారిపై ప్రభుత్వం కేసులు పెడుతోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. అన్ని మతాల స్వేచ్ఛను కాపాడటానికి భాజపా కట్టుబడి ఉందని అన్నారు. అంతర్వేది ఘటనలో హిందువులపై పెట్టిన కేసులను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విశాఖలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులపై కేసులను సత్వరమే తేల్చాలని సుప్రీం కోర్టు ఆదేశించితే.. రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉండదని విష్ణుకుమార్ రాజు అన్నారు. రాష్ట్రంలో ఉన్న దుర్మార్గమైన పాలన గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. ప్రజలకు డబ్బులు పంచిపెట్టి ఓటుబ్యాంకు రాజకీయం మాత్రం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి జరగక.. అనేక రంగాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్వేది విషయంలో నిరసనలు తెలిపిన హిందువులపై కేసులు నమోదు చేయటాన్ని భాజపా విశాఖ నగర అధ్యక్షుడు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. హిందువుల దేవాలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం శోచనీయమని అన్నారు. చలో అమలాపురం కార్యక్రమానికి వెళ్లే వారి పట్ల అవమానకర రీతిలో ప్రభుత్వం వ్యవహరించిందని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: 'స్టీల్ ప్లాంట్ భూములు ప్రైవేటు సంస్ధలకు కట్టబెట్టే యోచన'