Vontimitta Kodandarama Temple Looks as Kalasha Architecture : ఆంధ్రుల భద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయం కల్యాణ వేదిక కలశాకృతిలో ఆకట్టుకుంటోంది. వైఎస్సార్ జిల్లాలోని ఈ రామయ్య క్షేత్రం నుంచి ఇటీవల తీసిన డ్రోన్ వీడియో, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇక్కడి రాములోరి సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలను నిర్వహించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత 2015 సెప్టెంబరు 9న ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేశారు.
![Vontimitta Kodandarama Temple Looks as Kalasha Architecture](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-01-2025/23272257_vontimitta-kodandarama-temple.png)
అభివృద్ధి పనులు, భక్తులకు కావాల్సిన మౌలిక వసతుల కోసం రూ.వంద కోట్లు కేటాయించి టీటీడీ పనులు చేపట్టింది. కడప-రేణిగుంట జాతీయ రహదారి పక్కన విశాలమైన స్థలంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల వేళ రాములోరి కల్యాణం నిర్వహించడానికి తొలుత మండపాలను రూ.50 లక్షలతో నిర్మించింది. అప్పట్లో సీఎం చంద్రబాబు సీతారాముల కల్యాణానికి హాజరై శాశ్వత కల్యాణ వేదికను నిర్మిస్తామని ప్రకటించారు. రూ.45 కోట్లతో కలశం ఆకృతిలో నిర్మించారు.
![Vontimitta Kodandarama Temple Looks as Kalasha Architecture](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-01-2025/23272257_vontimitta-kodandarama-temple-looks-as-kalasha-architecture.png)
రాత్రంతా గంగమ్మ గుడిలోనే భక్తురాలు - ఉదయం చూసేసరికి షాక్
నేటి నుంచి 25 వరకు భవానీల విరమణ దీక్షలు- ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు
![](https://assets.eenadu.net/article_img/ap060125main17b.webp)