ETV Bharat / state

వంద కోట్ల మోసం - కోర్టులో హాజరు - 21 వరకు రిమాండ్​ - COURT REMANDS SAIMADHAV CHITS CHIEF

రూ. 100 కోట్ల వరకు అప్పుల ఎగవేత కేసులో సాయి సాధన చిట్ ఫండ్ అధినేత - ఈనెల 21 వరకూ రిమాండ్

COURT REMANDS SAIMADHAV CHITS CHIEF PALADUGU PULLARAO
COURT REMANDS SAIMADHAV CHITS CHIEF PALADUGU PULLARAO (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2025, 6:16 PM IST

Court Remands Sai Sadhana Chits Owner Paladugu Pullarao: వంద కోట్ల రూపాయల మేర అప్పుల ఎగవేత కేసులో పల్నాడు జిల్లానరసరావుపేటకు చెందిన సాయి సాధన చిట్ ఫండ్ అధినేత పాలడుగు పుల్లారావును పోలీసులు నరసరావుపేటలోని 13వ అదనపు జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇటీవలే గుంటూరు జిల్లా కోర్టులో లొంగిపోయిన పుల్లారావును పోలీసులు నరసరావుపేట తీసుకొచ్చారు. న్యాయస్థానం ఈనెల 21 వరకూ రిమాండ్ విధించడంతో తిరిగి గుంటూరు జైలుకు తరలించారు. చిట్‌ఫండ్‌ వ్యాపారం ముసుగులో చందాలు కట్టించుకున్న పుల్లారావు కొన్ని నెలలుగా చెల్లింపులు చేయడం లేదు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేయగా ఇతని బాగోతమంతా బట్టబయలైంది.

బాధితుల ఆందోళన: పల్నాడు జిల్లా నరసరావుపేటలో సాయిసాధనా చిట్ ఫండ్స్ బాధితులు రోడ్డెక్కారు. కమ్మ వసతి గృహంలో బాధితులంతా సమావేశమై తమకు రావాల్సిన బకాయిల గురించి చర్చించుకున్నారు. సాయిసాధనా చిట్ ఫండ్స్ ఎండీ పాలడుగు పుల్లారావు తమకు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, చిట్ కు చెల్లించిన నగదు రసీదులతో వందమందికి పైగా బాధితులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం చేకూరుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దాదాపు రూ 350 కోట్ల వరకు ప్రజా ధనాన్ని సాయి సాధన చిట్స్ అధినేత పుల్లారావు ఎగవేశారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

రూ.20వేల కోట్ల బ్యాంకు స్కామ్​.. ఏబీజీ షిప్​యార్డు వ్యవస్థాపక ఛైర్మన్​ అరెస్ట్​

చైనా కంపెనీకి షాక్.. గ్లోబల్​ వైస్​ ప్రెసిడెంట్​కు ఈడీ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.